India Vs Pakistan: వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ మార్పు.. దాయాదీల పోరు ఎప్పుడంటే.. ?
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు అభిమానుకు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సంవత్సరం జరగనున్న ప్రపంచ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తేదీని మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాలు
India Vs Pakistan: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ప్రపంచ క్రికెట్ సంగ్రామం కు మరి కొన్ని వారాల్లో తెర లేవబోతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రపంచ కప్ మ్యాచ్ లు ఇండియాలో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
ఈ మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్ ల డేట్లను దాదాపు ఏడాది క్రితమే బీసీసీఐ వారు ఐసీసీ కి అందించడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల బీసీసీఐ వారు మ్యాచ్ ల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రూప్ దశలో ఎలాంటి మార్పులు లేకుండా మ్యాచ్ లు జరిగే విధంగా తేదీలను మార్చడం జరిగిందని బీసీసీఐ వర్గాల వారు పేర్కొన్నారు.
మొదట అనుకున్న దాని ప్రకారం అక్టోబర్ 15వ తారీకున అహ్మదాబాద్ లోని అతి పెద్ద స్టేడియం అయిన మోడీ స్టేడియం లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ 15వ తారీకున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక భారత్, పాక్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో డేట్ ను రీ షెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 14వ తారీకునే ఈ మ్యాచ్ ను నిర్వహించబోతున్నారు. పండుగ అడ్డం రాకుండా మ్యాచ్ ను ఒక రోజు ముందుగానే నిర్వహించడం వల్ల క్రికెట్ అభిమానులకు పండుగ ఒక రోజు ముందు వచ్చినట్లు అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం పదుల కోట్ల సంఖ్య లో జనాలు వెయిట్ చేస్తున్నానరు.
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తో పాటు హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్ - నెదర్లాండ్ ఇంకా శ్రీలంక - పాకిస్తాన్ మ్యాచ్ ల తేదీల విషయంలో కూడా మార్పులు వచ్చినట్లుగా బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు. వందల కోట్ల బిజినెస్ లావాదేవీలు జరిగే ఈ మ్యాచ్ లను సరైన సమయంలో నిర్వహిస్తేనే అన్ని విధాలుగా లాభం. అందుకే చాలా ముఖ్యమైన భారత్, పాకిస్తాన్ జట్ల మ్యాచ్ తేదీని మార్చినట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి రీ షెడ్యూల్ చేసి మరీ ఆలస్యం చేయకుండా లేదంటే మ్యాచ్ ను క్యాన్సల్ చేయకుండా బీసీసీఐ భలే నిర్ణయం తీసుకుంది అంటూ క్రికెట్ అభిమానులు ఆనందంగా ఉన్నారు. మరి కొన్ని వారాల్లో ప్రారంభం కాబోతున్న ఈ ప్రపంచ కప్ లో టీం ఇండియా కుమ్మేయాలి... కప్ తేవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి